కందుకూరు పట్టణం లోని అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో వచ్చేనెల 7న జరగనున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి డిఎస్పి రామచంద్ర ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు సుమారు 20వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.