మార్టూరు సచివాలయం-2 పరిధిలోని యాదవ్ కాలనీ , చెంచు కాలనీ , జనార్ధన్ కాలనీ ల నందు బుధవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలకు వివరించారు. అలాగే సచివాలయం-4 ఎదురుగా ఎన్ హెచ్ 16 హైవే ప్రక్కన జరుగుతున్న డ్రైనేజీ పనులను దగ్గరుండి పరిశీలించారు.