పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, టీచర్స్, ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పట్టపు శీనయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెప్టెంబరు 30లోగా సమస్యలు పరిష్కరించకుంటే లక్ష మందితో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.