జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఓ నలుగురు కలిసి కోడి కత్తి డ్రామా ప్లాన్ చేశారని నిందితుడు జల్లిపల్లి శ్రీనివాసరావు తరపు లాయర్ సలీమ్ ఆరోపించారు. దీనివెనుక జగన్, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హస్తం ఉందని వ్యాఖ్యానించారు. కోడికత్తి ఘటన జరిగిన విశాఖ విమానాశ్రయంలో అసలేం జరిగిందనేది పూర్తి చరిత్ర, దానికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కోడికత్తి దాడి పథకం విజయవంతమైతే సానుభూతి వెల్లువెత్తి జగన్ సీఎం అవుతారని వారు ముందుగానే ఊహించారు. ఆ తర్వాత అదే నిజమైంది. ఇప్పుడు జగన్ సీఎం సీట్లో ఉన్నారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతానన్న జగన్ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆయనకు చట్టంపై విశ్వాసం లేదని, అందుకే ‘రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం’ అని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.