జీ20 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.