ఈ సారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగన్ గెలవడు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ‘రాష్ట్రాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం’ నినాదంతో నిర్వహిస్తున్న సీపీఐ బస్సు యాత్ర బుధవారం రాత్రి కడపలోని పాత కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ...... ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నిప్పులగుండంలోకి నెట్టారన్నారు. కరెంటు చార్జీలు 9 సార్లు పెంచారని, ఇసుక రేట్లు అమాంతంగా పెరిగాయన్నారు. కేవలం ఐదు నెలల్లోనే రూ.55వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులగుండంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసి ఈ నిరంకుశపాలనను అంతం చేయాలన్నారు.