కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించింది. వంట గ్యాస్ ధర రూ.200 తగ్గించి ఊరట కలిగించిన కేంద్రం ఇంధన ధరలు కూడా తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం, ఇంధన ధరల తగ్గింపుపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సిటీ గ్రూప్ అంచనా వేసింది.