చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం, నంద్యాల ఎలిఫెంట్ సెంటర్ నుంచి వినాయక, జయంతి రెండు ట్రైనీ కుంకి ఏనుగుల సహాయంతో అటవీ శాఖ అధికారులు మదపుటేనుగును అడవుల్లోకి మళ్లించే ఆపరేషన్ మొదలు పెట్టారు. ఏనుగులను మళ్లించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు మదపుటేనుగును ట్రాకర్లు వెళ్లగొట్టారు. ఆపరేషన్ కార్యక్రమంలో ముగ్గురు ట్రాకర్లకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. కాగా గుడిపాల మండలం 190 రామాపురం గ్రామంలో భార్యాభర్తలు వెంకటేష్, సెల్విపై ఒంటరి మదపుటేనగు దాడి చేసి చంపేసింది. శ్రీరంగంపల్లి చెరువులో ఉన్న మదపుటేనుగును అడవుల్లోకి తరలించేందుకు కుంకీ ఏనుగుల సహాయంతో ఆపరేషన్ మొదలు పెట్టారు.