మీ దగ్గర ఇంకా రూ.2 వేల నోట్లు ఉన్నట్లయితే, వాటిని వెంటనే మార్చుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా త్వరగా ఈ నోట్లను మార్చుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుకు వెళ్లి ఒక దఫాలో రూ.20 వేల వరకు (10 నోట్లు) మార్చుకోవచ్చని లేదా ఖాతాలో జమచేసుకోవచ్చని వివరించారు.