దేశంలో ల్యాప్‌టాప్‌ల తయారీకి ప్రముఖ కంపెనీలు హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్ సహా మొత్తం 32 కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ 32 కంపెనీలు దేశంలో ఉత్పత్తి ప్రారంభిస్తే కొత్తగా 75 వేల ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఇటీవల ల్యాప్‌టాప్ దిగుమతులపై విధించిన ఆంక్షలు.. దేశంలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తిని పెంచేందుకు దోహదం చేస్తాయని వివరించారు.