రాప్తాడు మండల కేంద్రంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం సమరభేరికి పిలుపునిచ్చింది. పంట పొలాలకు 9గంటల విద్యుత్తు సక్రమంగా సరఫరా చెయ్యాలని, ఎండిపోతున్న పంట పొలాలకు ఎకరాకు రూ. 50 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాప్తాడు మండలంలో జీపు జాత గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa