అనంతపురం జిల్లా, శింగనమలలో కాపరి మానుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంలో 15 గొర్రెలు మరణించాయి. మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గురువారం మధ్యాహ్నం ఆయకట్టు భూముల్లోనికి మాను గొర్రెల మంద మేత కోసం తోలుకెళ్లాడు. ఆ సమయంలో వర్షం రావడంతో సమీపంలోని టెక్కె దర్గా వద్దకు గొర్రెలను తోలుకెళ్లాడు. అక్కడున్న కుక్కలు ఆ గొర్రెలపై దాడి చేయడంతో అవి చనిపోయాయి. తనకు దాదాపు రూ.15,000 నష్టం వాటిల్లిందని కాపరి మాను వాపోయాడు.