ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ హెచ్. ఎం, కె. నిరీక్షణరావు చెప్పారు. మండల కేంద్రం అమృతలూరు లోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వ చ్చత ప్రతిజ్ఞ నిర్వహించారు. స్వచ్ఛ పక్వాడ్ పక్షోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులనుద్దేశించి హెచ్. ఎం, మాట్లాడుతూ ఇంటిని, ఇంటి పరిసరాలను, పాఠశాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ స్వచ్ఛ పక్వాడ ను జయప్రదం చేయాలని కోరారు.