ఏపీ హైకోర్టులోని లీగల్ సర్వీసెస్ కమిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక సీనియర్ అసిస్టెంట్ , ఒక జూనియర్ అసిస్టెంట్, రెండు స్టెనో-టైపిస్ట్ పోస్టులు, ఒక ఆఫీస్ సబార్డినేట్ (మొత్తం ఐదు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 14 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి(ఎ్ఫఏసీ)బబిత బుధవారంపత్రికాప్రకటన ఇచ్చారు.