గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా కోతిబొమ్మ సెంటర్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని, నెహ్రుచౌక్ సెంటర్లో విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని జైభీమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. గురువారం ఆర్డీవో కార్యాలయం, ఆర్ అండ్ బీ కార్యాలయాల్లో సొసైటీ వినతిపత్రాలను సమర్పించింది. సొసైటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణారావు, కోశాధికారి మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శి డి.ఉపేంద్ర, సభ్యులు జి.చంద్రశేఖర్, రవీంద్ర పాల్గొన్నారు.