మచిలీపట్నం పరిధిలోని కృత్తివెన్ను మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన పెదశింగు ప్రసాద్‌పై నేరం రుజువు కావడంతో గురువారం మచిలీపట్నం పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ షేక్ మహ్మద్ ఫజాలుల్లా నిందితుడికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముంజులూరు వెంకట మహేష్ 11 మంది సాక్షులను విచా రించి నేరం రుజువు చేయించారు. 2019లో పెదశింగు ప్రసాద్ బాలికను పెళ్లి చేసుకుం టానని నమ్మించి గర్భవతిని చేశాడు. వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది.