కోడి కత్తి కేసుపై టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయన మాట్లాడుతూ.. టీడీపీ తనపై కుట్ర చేస్తోందని చిన్న శ్రీను మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాట్లాడిన లాయర్ గురించి మాట్లాడడం మానేసి టీడీపీని ఇందులోకి లాగడం ఏంటని ప్రశ్నించారు. నాలుగు ఏళ్ళుగా నిందితుడు శ్రీనుకి ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళిత యువకుడు నాలుగు ఏళ్ళుగా జైల్లో మగ్గిపోతున్నాడని కిమిడి నాగార్జున అన్నారు.