మాజీ మంత్రి, టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో సంభాషించారు. సీనియర్ నేత అయ్యన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. అరెస్ట్, కేసులతో అయ్యన్న గొంతు నొక్కాలి అని చూస్తున్నారన్నారు. తాను దైర్యంగా ఉన్నానని.. జగన్ను, అసమర్థ ప్రభుత్వాన్ని వదిలేది లేదని అయ్యన్న చెప్పారు.