టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల సొమ్మును ఎంత కొట్టేశారో ఐటీ నోటీసుల ద్వారా బహిర్గతమైందన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా ఈ ముడుపుల వ్యవహారం నడిపారని తెలిపారు. చంద్రబాబుకు లంచం రూపంలో రూ.118 కోట్లు అందాయని ఆరోపించారు. తాత్కాలిక రాజధాని పేరుతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.