పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అజెండాను ప్రకటించకపోవడం సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయని.. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించేందుకు బిల్లు ప్రవేశపెడతారని.. ఇంకా కొత్తగా ఏవైనా సంచలన బిల్లులు తీసుకువస్తారా అనే అనుమానాలు రాజకీయ పార్టీలు, విశ్లేషకుల్లోనే కాకుండా దేశ ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఏం చర్చిస్తారు.. ఏం బిల్లులు తీసుకువస్తారు అనే దానిపై ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అజెండాలోని అంశాలను కేంద్రం వెల్లడించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన అజెండాలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. ఆ ముఖ్యమైన అంశాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ముఖ్యమైన విషయాలు ఏంటనేది మాత్రం వెల్లడించేందుకు ప్రహ్లాద్ జోషి నిరాకరించడం గమనార్హం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలకు పిలుపును ఇవ్వడం ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ సమావేశాలపై మరింత ఆసక్తిగా మారాయి. అయితే త్వరలోనే అజెండాను దేశ ప్రజలందరికీ తెలియజేస్తామని పేర్కొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. దానికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు.
సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి సెప్టెంబరు 22 వ తేదీ వరకు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం వెల్లడించారు. చెప్పారు. మొత్తం ఐదు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయని.. అయితే ఈ అమృత్ కాలంలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని కేంద్రం ఆశిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఇలా ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకుముందు జీఎస్టీ అమలు చేయడానికి 2017 జూన్ 30 న ప్రత్యేకంగా అర్థరాత్రి సమయంలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈసారి మాత్రం అలా కాకుండా పూర్తిస్థాయిలో.. లోక్‌సభ, రాజ్యసభలు వేర్వేరుగా ఐదు రోజుల పాటు సమావేశం కానున్నాయి.