ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తీసుకురావాల్సిన బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండగా.. ‘జమిలి’ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.