డ్వాక్రాలో తమ పేరుతో రేపల్లె మెప్మా సిబ్బంది అక్రమలోన్స్ తీసుకొని మోసం చేశారని సమస్య పరిష్కారం చేసి తమకు న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు రాజ్యసభ సభ్యులు ఎంపీ మోపిదేవి వెంకట రమణరావును కోరారు. సమస్యను పరిష్క రించాలని కోరుతూ సీపీఎం, ఐద్వాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీ మోపిదేవి వ్యక్తిగత కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను విన్నవించారు. సమస్యను పరిష్కరిస్తానని ఎంపీ మోపిదేవి హామీ ఇచ్చారు.