గుర్తు తెలియని వ్యక్తి డెబిట్ కార్డును అపహరించి ఖాతా నుంచి రూ. 25 వేలు ఉపసంహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. యడ్లపాడు మండలంలోని చెంఘీజ్ ఖాన్ పేటకు చెందిన గంధం రాంబాబు గతనెల 30న బోయపాలెంలోని ఏటీఎంకు నగదు తీసుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న గుర్తు తెలియని యువకుడు మాటల్లో పెట్టి అతడికి మరో డెబిట్ కార్డు ఇచ్చి ఉడాయించాడు. నగదు ఖాతా నుంచి బదిలీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.