దుర్గి మండలం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం గురజాల డిఎస్పి పల్లపు రాజు ఆకస్మింగంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషను పరిశీలించి అనంతరం స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసుల గురించి ఎస్సై శివా ను అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన రికార్డులను స్వయంగా పరిశీలించి వాటిపై ఆరా తీశారు ఈనెల 9వ తేదీన మాచర్ల కోర్టులో నిర్వహించనున్న లోక్ అదాలత్లో రాజీ కేసులను సిద్ధం చేయాలన్నారు.