అచ్చుతాపురం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పది గ్రామాల రైతులతో చిరుధాన్యాలపై శిక్షణ కార్యక్రమాన్నినిర్వహించారు. చిరుధాన్యాలలో ఉన్న పోషక విలువలు గురించి వివరించారు. ఏషియన్ పెయింట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ వి. ప్రసాదరావు, ఏపీసిన్ ఆఫ్ కో-ఆర్డినేటర్ లక్ష్మి, ఏషియన్ పెయింట్స్ హెచ్ఆర్ ఉదయ్ పాల్గొన్నారు.