విశాఖ- గుణుపూర్ పాసిం జర్ రైలులో ఓ ఆగంతకుడు మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం గుణుపూర్ పాసింజర్ లో విశాఖ బయలుదేరారు. విశాఖ నగర పరిధి కంచరపాలెం వద్ద రైలు నెమ్మెదిగా వెళ్తున్న సమయంలో ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. అతను మాస్క్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.