ప్రధాని నరేంద్ర మోదీని సూర్యుడిపైకి పంపాలని ఇస్రో శాస్త్రవేత్తలకు బిహార్ మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ముంబైలో ఇండియా కూటమి సమావేశంలో లాలు మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో విబేధాలు ఉన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కూటమిని మరింతగా బలోపేతం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఇండియా కృషి చేస్తోందన్నారు.