సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘ఆదిత్య L1’ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆదిత్య L1 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో PSLV-C57 రాకెట్ ప్రవేశపెట్టింది. దీనిపై ఇస్రో సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు. 'ఆదిత్య L1' శాటిలైట్ సూర్యుడి దిశగా దాదాపు 15 లక్షల కి.మీ ప్రయాణించి లగ్రాంజ్ పాయింట్ వద్దకు 125 రోజుల తర్వాత చేరుకోనుంది.