రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు విద్యుత్ చార్జీల అదనపు భారం వేస్తూ మరో వైపు విద్యుత్ కోతలు అమలు చేయడం వల్ల సామాన్య ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్ విమర్శించారు. శనివారం కడప నగరంలోని పాత బస్టాండ్ లో ఉన్న పూలే సర్కిల్ లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దహనం చేశారు.