ఆదిత్య-ఎల్1ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. ఆ తర్వాత ఎల్1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం ఎల్1 బిందువును చేరుకుంటుంది. ఆదిత్య-ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది.