లివ్ ఇన్ రిలేషన్స్, సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఇదో క్రమబద్ధమైన రూపకల్పనలా పని చేస్తోందని వ్యాఖ్యానించింది. లివ్ ఇన్ పార్టనర్ పై అత్యాచార నిందితుడు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహ వ్యవస్థ వ్యక్తికి అందించే భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వం, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండదని ధర్మాసనం పేర్కొంది.