గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.