పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ పరిధిలో గత రాత్రి మద్యం మత్తులో వైసీపీ నేత వెంకటరామిరెడ్డి కారును కొందరు యువకులు ఢీకొట్టారు. అంతే కాకుండా మద్యం మత్తులో వైసీపీ నేత కారుపై యువకుడు దాడి చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేత ఫిర్యాదుతో యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకులను తమకు అప్పగించలంటూ వైసీపీ నేత అనుచరులు స్టేషన్ చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.