శ్రావణ మాసం మూడో శనివారం సందర్బంగా ప్రొద్దుటూరు పరిధి రాజుపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెల్లాల గ్రామంలో శ్రీచెన్నకేశవ, సంజీవరాయస్వామి ఆలయాల్లో శనివారం సాయంత్రం ఒంటె వాహనంపై సంజీవరాయుడిని వైభవంగా ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో సంజీవరాయస్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించి ఒంటె వాహనంపై వైభవంగా ఊరేగించారు. ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.