వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజుమన్ స్కూల్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల తోపాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ నాయుడు, నూరీ ఫాతిమా పాల్గొని ప్రజలకు మందులను అందజేశారు. ప్రజల ఆరోగ్యమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.