రాష్ట్రవ్యాప్తంగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైప్ రైటింగ్ పరీక్షలు రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తుండగా రేపల్లె సెంటరులో 47 మంది పరీక్షకు హాజరయ్యారు అన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa