గత కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు ఆదివారం కొమరాడ మండలం గుణానపురం వద్ద గుంపులో కలిసింది. దీంతో అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల గుంపు నుంచి ఒంటరి ఏనుగు విడిపోవడంతో అటవీ శాఖ సిబ్బంది కూడా రెండు భాగాలుగా విడిపోయి ఏనుగులను నిరంతరం పర్య వేక్షిస్తుండేవారు. విడిపోయిన ఏనుగుతో ప్రమాదం పొంచి ఉందన్న భావనతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.