వాహనదారులు నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ డి. విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం విజయనగరం పట్టణంలో శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, కోట, దాసన్నపేట రైతుబజార్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అస్తవ్యస్తమైన నంబర్ ప్లేట్లతో రాకపోకలు సాగిస్తున్న 68 ద్విచక్ర వాహనదారులను గుర్తించి వాటిని తొలగించారు.