ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిడ్డ చెయ్యి జారీ కాలువలో పడిపోయింది అంటున్న తల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 01:58 PM

చిత్తూరు జిల్లా,  పలమనేరులో దుర్భర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... ఆదివారం తెల్లవారు జామున సుమారు 4 గంటల ప్రాంతంలో వృద్ధురాలితో కలిసి 39ఏళ్ల మహిళ పలమనేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. తాను ఇంటి వద్దే పురుడు పోసుకొన్నానని, బిడ్డ చనిపోయిందని తదుపరి చికిత్స చేయాలని కోరారు. ఆమెను చేర్చుకుని వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత గంటన్నరకు ఆస్పత్రి సమీపంలోని కేవీ స్ట్రీట్‌ మురుగునీటి కాలువలో పురుటిబిడ్డ ఏడుస్తుండగా స్థానికులు గుర్తించారు. ఆ ఆడశిశువులను కాలువ నుంచి బయటకు తీసి చికిత్సకోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ బిడ్డకూ డ్యూటీ డాక్టర్‌ యుగంధర్‌ చికిత్స అందించారు. అప్పటికే పురుడు పోసుకొని చికిత్సకోసం చేరిన అమరావతిని డాక్టర్‌ నిలదీయడంతో తాను మూత్రవిసర్జనకు మురుగునీటి కాలువ వద్దకు వెళ్లగా అనుకోకుండా బిడ్డ కాలువలో పడిపోయిందని ఆమె చెప్పారు.ఈ విషయం ఐసీడీఎస్‌ అధికారిణి ఇందిరాప్రియదర్శిని దృష్టికి రావడంతో ఆమె తన సిబ్బందితో ప్రభుత్వాస్పత్రికి చేరుకొన్నారు. తదుపరి చికిత్స కోసం ఆ పురిటి బిడ్డను చిత్తూరు కు తరలించారు.ప్రస్తుతం పురిటి బిడ్డకు ఇన్‌ఫెక్షన్‌ ఉందని ఇందిరా ప్రియదర్శిని తెలిపారు. కాగా, తన బిడ్డ తనకు కావాలని అమరావతి కోరుకుంటోందన్నారు పురుటి బిడ్డ కోలుకొన్న తరువాత సీడబ్లూసీ కమిటీ వారు పాపను ఆమెకు అందజేసే విషయమై నిర్ణయం తీసుకొంటారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa