బీజేపీపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మతాన్ని తన ఆయుధంగా చేసుకుంటోందని విమర్శించారు. ప్రజల మతపరమైన భావాలను రెచ్చగొట్టి, ఆ మంటల్లో బీజేపీ నాయకులు చలి కాచుకుంటున్నారన్నారు. కమలం పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో తన హామీలను వేటినీ నెరవేర్చలేదన్నారు. సామాజిక న్యాయం, సమాఖ్య భావన, లౌకికవాద రాజకీయాలను పునరుద్ధరించేందుకు తమ కూటమి ఏర్పడిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa