జమ్మలమడుగులో పతంగే రామన్నరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 8న ఎస్జీఎఫ్ మండలస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం హెచ్ఎం రమణారెడ్డి తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, టెన్నికాయిట్, యోగా, అథ్లెటిక్స్ అండర్-14, అండర్-17 విభాగాలలో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa