కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంగళవారం రైల్వే కోడూరు జడ్పిటిసి పాలెం కోట రత్నమ్మ మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు ఇచ్చిన వారికి వైయస్సార్ జలకళ కింద బోర్లు, మోటర్లు, విద్యుత్ మంజూరు చేసి భూములు సాగు లొకి తేవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు సమాధానం ఇస్తూ తొందరలో బోర్లు వేస్తామని హామీ ఇచ్చారు.