గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సగిలేరు వాగు ముంపు ప్రాంతంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ హయాంలో సగిలేరు వాగుపై రక్షణ గోడా ఏర్పాటు చేసేందుకు 14 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ నిధులను రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రాంతంలో రక్షణ గోడా ఏర్పాటు చేయాలని అశోక్ రెడ్డి అన్నారు.