గుంతకల్లు రెవిన్యూ డివిజన్ అధికారిగా పని చేస్తున్న జె. రవీంద్రను అనంతపురం జిల్లా ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ శైలం శ్రీ భ్రమరాంభా మల్లికార్జున స్వామి ఆలయం ఈఓగా విధులు నిర్వహిస్తున్న ఎస్. లవన్నను గుంతకల్లు రెవిన్యూ డివిజన్ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.