స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 65,780 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 19,574 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (2.09%), టైటాన్ (1.27%), ఐటీసీ (1.26%), బజాజ్ ఫైనాన్స్ (1.06%), నెస్లే ఇండియా (0.98%).
టాప్ లూజర్స్ : అల్ట్రాటెక్ సిమెంట్ (-1.46%), మారుతీ (-0.93%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.57%), ఎన్టీపీసీ (-0.53%), విప్రో (-0.53%).