రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభానికి జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యు త్తు సరఫరా చేసి చిన్న, మధ్యతరహా అత్యవసర ఉత్పత్తుల పరిశ్రమలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మిగులు విద్యుత్తు నుంచి విద్యుత్తు కోతలకు, లోడ్ సెట్టింగులకు గురికావడానికి విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయడమే కారణమన్నారు.