ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3200 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టకపోవడంతో శాశ్వత అధ్యాపకుల కొరత ఏర్పడిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లోగా ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు.