మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖపై ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త కాలేజీల్లో వసతులు, మొదటి కౌన్సెలింగ్లో సీట్ల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. హెల్త్ వర్సిటీ నుంచి వైద్య కళాశాలలపై మరింతగా నిఘా పెంచాలని ఆదేశించారు. ప్రయివేటు వైద్య కళాశాలల ఎల్వోపీలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.