కనగానపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేపకుంట ఎస్సీ కాలానికి చెందిన వీర ఓబులేసు ఇల్లు బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకులింది. వెంటనే అప్రమత్తమైన వీరఓబులేసు, అతడి తమ్ముడు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారాన్ని అందించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa