సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామం నందు బుధవారం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లు పాల్గొని ఇంటింటికి తిరిగి బాబు మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కలుగుతుందని తెలియజేశారు.